Claims

PrintPrintEmail this PageEmail this Page

వ్యక్తిగత ప్రమాద దావాలు

 • భీమా చేసిన వారికి తక్షణము తెలియజేయాలి.
 • ప్రమాదవశాత్తు మరణించినప్పుడు, భీమాదారు యొక్క చట్టపరమైన నామినీ/పేర్కొన్న వారికి మూలధనము మొత్తం చెల్లించబడుతుంది. భీమా చేసుకున్న వ్యక్తి నామినీ పేరును ఇవ్వడంలో విఫలమైతే, న్యాయస్థానం నుండి వారసత్వపు ప్రమాణ పత్రం అవసరం అవుతుంది.

ఇతర దావాల విషయంలో, భీమా సంస్థ భీమాదారుడుని ఒక నిపుణునిచే పరీక్షించవచ్చు లేదా ఈ విషయం గురించి వైద్య బోర్డుకు సూచించాలి, దాని యొక్క ఖర్చును భీమా సంస్థ భరిస్తుంది.

అగ్ని / IAR పాలసీల క్రింద దావాలు

 • ముందుగా భీమాదారుడు నష్టాన్ని తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకోవాలి.
 • అగ్నిమాపక దళానికి తక్షణమే తెలియజేయవచ్చు.
 • అల్లర్లు, కార్మికుల బంద్, ఇతరుల వలన కలిగిన హానికరమైన నష్టము లేదా తీవ్రవాద చర్యలు వంటి వాటి వలన అగ్నిప్రమాదం జరిగితే పోలీసులకి ఫిర్యాదు ఇవ్వాలి.
 • 24 గంటలు మించకుండా భీమా చేసిన సంస్థకి వీలైనంత త్వరగా తెలియజేయండి.
 • భీమా సంస్థ నియమించిన సర్వేయరుకి సంబంధిత సమాచారాన్ని ఇచ్చి సహకరించండి.
 • తుఫాను, వరదలు & వరదల కారణంగా నష్టానికి సంబంధించిన ఒక వాతావరణ నివేదికను పొందండి.
 • పాలసీ 'పునర్నిర్మాణ పద్ధతి'లో ఉన్నట్లయితే, దెబ్బతిన్న వస్తువుల మరమ్మతులు / పునఃస్థాపన మరియు దావా చెల్లింపుల కోసం బిల్లులను సమర్పించిన తర్వాత మాత్రమే దావా పరిష్కరించబడుతుంది.

దోపిడీ దావాలు / నగదు భీమా / విశ్వాసము

 • వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి మరియు వస్తువులు దొరకలేదని ఒక నాన్-ట్రేసబుల్ సర్టిఫికేటును తీసుకోవాలి.
 • భీమా సంస్థకి వీలైనంత త్వరగా తెలియజేయాలి.
 • భీమా సంస్థ నియమించిన విలువ కలిగిన స్టాంపు కాగితంపై బాధ్యత వహించే లేఖను తీసుకుంటారు - దొంగిలించిన ఆస్తి పునరుద్ధరించబడినప్పుడు దావా మొత్తాన్ని తిరిగి చెల్లించడం కోసం ఉపప్రతి పత్రము.
 • పోలీస్ నుంచి తుది నివేదికను తీసుకోండి.
 • భీమాదారు సర్వేయరుకి నష్టము జరిగిన తేదీన అయిన బిల్లులను మరియు పూర్తి ఖాతాల పుస్తకము అందించాలి.

యంత్రాలు విచ్ఛిన్నం

 • భీమా సంస్థకి తక్షణమే తెలియజేయాలి.
 • తనిఖీ కోసం ఏర్పాట్లు చేయడానికి భీమా సంస్థతో దావా వేయాలి మరియు మరమ్మతుల ఖర్చు అంచనాను పంపాలి.
 • పాక్షిక నష్టాల విషయంలో, తరుగుదల వసులు చేయబడదు, కానీ వస్తువుల ప్రస్తుత రోజు భర్తీ విలువ కోసం భీమా చేయనప్పుడు, ఈ వస్తువులని భీమా కింద పరిగణిస్తారు మరియు దావా మొత్తాన్ని తగినట్లుగా తగ్గించవచ్చు. మొత్తం నష్టాల దావాలకు మాత్రమే తరుగుదల వర్తించబడుతుంది.
 • ఒక ఉపకరణం పాక్షికంగా దెబ్బతింటునట్లయితే, దీనిని ఉపయోగించక ముందు (భీమా సంస్థ నుండి అనుమతి పొంది) మరమ్మతులు చేయించాలి, లేకపోతే తరవాత జరిగే నష్టము భర్తీ చేయబడదు.

ఎలక్ట్రానిక్ పరికరాలు

 • భీమా సంస్థకి తక్షణమే తెలియజేయాలి.
 • తనిఖీ కోసం ఏర్పాట్లు చేయడానికి భీమా సంస్థతో దావా వేయాలి మరియు మరమ్మతుల ఖర్చు అంచనాను పంపాలి.
 • పాక్షిక నష్టాల విషయంలో, భాగాల విషయంలో తరుగుదల కోసం మినహాయింపు ఉండదు, పరిమిత జీవితం ఉన్నవాటికి తప్ప, కానీ ఏదైన నివృత్తి విలువ మొత్తము పరిగణనలోకి తీసుకోబడుతుంది.
 • ఒక ఉపకరణం పాక్షికంగా దెబ్బతింటునట్లయితే, దీనిని ఉపయోగించక ముందు (భీమా సంస్థ నుండి అనుమతి పొంది) మరమ్మతులు చేయించాలి, లేకపోతే తరవాత జరిగే నష్టము భర్తీ చేయబడదు.

గృహోపకరణాల రవాణా

 • రవాణాలో ఏదైనా నష్టం జరిగితే, సరుకు రవాణా వాహనం మీద ఉందని తెలపడం అవసరం మరియు వారి సర్టిఫికేట్ పొందాలి.
 • రవాణాలో నష్టము విషయంలో, భర్తీ హక్కులను పరిరక్షించడానికి సమయ పరిమితిలో క్యారియర్తో ఒక నగదు దావా సమర్పించాలి, ఇది లేకుండా, దావా అనుమతించబడదు.

సముద్ర రవాణా నష్టం

 • అసలైన రశీదు & ప్యాకింగ్ జాబితా - రశీదులో ఒక భాగమైతే.
 • రవాణాలో ఏదైనా నష్టం జరిగితే, సరుకు రవాణా వాహనం మీద ఉందని తెలపడం అవసరం మరియు వారి సర్టిఫికేట్ పొందాలి.
 • లారీ అసలు రసీదు (LR) / సరుకు ఎక్కించిన బిల్లు - రవాణాలో పోవొచ్చు లేదా పరిమాణంలో తేడా వంటివి గుర్తించడానికి.
 • వెల్లడించిన పాలసీ విషయంలో - సరుకును ప్రకటించటం మరియు దాని విలువ భీమా మొత్తము పరిధిలో ఉండాలి.
 • రవాణాలో నష్టము విషయంలో, భర్తీ హక్కులను పరిరక్షించడానికి సమయ పరిమితిలో క్యారియర్తో ఒక నగదు దావా సమర్పించాలి.
 • క్యారియర్ నుండి నష్టం / కొరత సర్టిఫికేట్.
 • నష్టము యొక్క స్వభావం, కారణం మరియు విస్తృతిని గుర్తించేందుకు ఒక సర్వేయరు (మధ్యవర్తిగా అంగీకారం పొందినవాడు) నియమించబడాలి.

Download Motor Policy

Feedback