దావాలు

PrintPrintEmail this PageEmail this Page

అన్ని భీమా ఒప్పందాల ప్రతిపాదన రూపంలో భీమాదారు అందించిన సమాచారం ఆధారంగా ఉంటాయి. భీమా ఒప్పందాలకు ప్రతిపాదన ఫారం ఒక ఆధారాన్ని రూపొందిస్తుంది.

దావాల పరిష్కార విధానంలో మీకు సహాయపడే కొన్ని ముఖ్యమైన విషయాలు.

 • నష్టాన్ని లేదా హానిని వెంటనే భీమా సంస్థకి తెలియజేయాలి.
 • దావా అభ్యర్ధన అందితే, భీమా సంస్థ ఒక దావా ఫారమును పంపుతుంది.
 • భీమా సంస్థకి నష్టము యొక్క అంచనాతో పూర్తిస్థాయి దావాను సమర్పించండి. ప్రతీ వస్తువు యొక్క అంచనా విలువను విడివిడిగా సమర్పించడం ఉత్తమం.
 • భీమా సంస్థ దెబ్బతిన్న వస్తువుల నష్టాన్ని అంచనా వేయడానికి తనిఖీ ఏర్పాట్లు చేస్తుంది. పెద్ద నష్టాలు విషయంలో, ఒక ప్రత్యేక-లైసెన్స్ ఉన్న సర్వేయర్ను నియమిస్తారు.
 • నష్టపరిహారం యొక్క అంచనాని నిరూపించడానికి భీమాదారుడు అవసరమైన పత్రాలను అందించాలి.
 • నష్టానికి కారణం లేనట్లైతే, భీమాదారు పొందిన నష్టాన్ని లేదా హానిని భీమా చేసిన ప్రమాదాలలోనిదని నిరూపించాలి.
 • భీమాదారునికి మరియు భీమా చేసిన వారికి మధ్య దావా మొత్తం ఒప్పందం ప్రకారం, దావా పరిష్కరించబడుతుంది.
 • పేర్కొన్న విధముగా పాలసీ షరతులు మరియు నిబంధనల ప్రకారం "క్లెయిమ్ ఎక్సెస్" దావా నుండి తీసివేయబడుతుంది.

పాలసీల వైవిధ్యమైన స్వభావం దృష్ట్యా, వ్యక్తిగత పాలసీలకు కొన్ని భిన్నమైన పాయింట్లు, పైన ఉన్న వాటికి అధనంగా, క్రింద ఇవ్వబడ్డాయి: (దయచేసి పేర్కొన్న పత్రాలు దావా పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని గమనించండి, భీమా సంస్థ అదనపు పత్రాల కొరకు అభ్యర్థించవచ్చు)

మోటారు వాహన (ప్రైవేట్ & ద్విచక్ర వాహనాలు) దావాలు

మోటరు పాలసీల యొక్క దావాలు

 • ఇతర వ్యక్తుల వాల్ల ఒక ప్రమాదానికి (తప్పనిసరిగా దావా అవసరం లేదు) గురైతే ఆ విషయాన్ని భీమాసంస్థకి చెప్పాలి.
 • భీమా చేయించుకున్న వ్యక్తి తను చెల్లించాల్సిన బాధ్యత వహిస్తున్నారా లేదా అనేదానిపై భీమా చెల్లించటానికి ఆసక్తి కలిగి ఉండవచ్చు. అందువల్ల భీమా చేసిన వారి యొక్క అనుమతి లేకుండా ఏ దావాను అనుమతించరాదు.
 • పెద్ద దావాల విషయంలో, భీమా సంస్థలు పౌర న్యాయస్థానాల్లో పరిహారం దావాలకుగాను డ్రైవర్ ఫై క్రిమినల్ కేసును పెట్టవచ్చు.
 • ఇతరులు ఉన్న ప్రతీ ప్రమాదమును పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. మూడవ పార్టీ బాధితుడు నేరుగా భీమా సంస్థ ఫై కేసు కొనసాగవచ్చని M.V. ఆక్ట్ చెబుతుంది. జరిగిన ప్రమాదాన్ని భీమా సంస్థకు నివేదించకపోతే, భీమా చేసిన వారు దీనిని పాలసీ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించవచ్చు. అటువంటి సందర్భాల్లో, భీమా సంస్థ న్యాయస్థానం ద్వారా పరిహారం చెల్లించాల్సి వచ్చినప్పటికీ పేర్కొన్న పాలసీ నిబంధనలని ఉల్లంఘించినందుకు భీమాదారు నుండి అటువంటి దావా సొమ్మును వారు తిరిగి రాబట్టుకునే అవకాశాన్ని కలిగి ఉంటారు.

       Procedure
ఒక ప్రమాదం విషయంలో తీసుకోవలసిన చర్యలు:

 • ఇఫ్కో-టోకియో జనరల్ ఇన్సూరెన్స్ టోల్ ఫ్రీ నంబరు 1800 103 5499 తో ప్రమాదం యొక్క నోటీసుని దాఖలు చేయాలి.
 • ఒకవేళ నష్టము పెద్దది అయితే, ప్రమాదము జరిగిన ప్రదేశమును నుండి వాహనాన్ని తీసివేయక ముందు రిపోర్ట్ చేయాలి తద్వారా భీమా సంస్థ అక్కడికి అక్కడే నష్టము యొక్క తనికీ చేసుకోగలరు.
 • వాహనం మరమ్మత్తు ఛార్జీలు అంచనా కోసం ఒక వర్కుషాపు నుండి, సాధికార వర్కుషాపునకు తరలించబడవచ్చు.
 • పూర్తిస్థాయి దావా ఫారం మరియు మరమ్మతుల అంచనాను ఆధారంగా నష్టపరిహారం మరియు మరమ్మత్తుల వ్యయమును భీమా సంస్థ నిర్థారిస్తారు.
 • భీమా సంస్థ ప్రమాదం జరిగినప్పుడు దానిని ఒక లైసెన్స్ ఉన్న వ్యక్తి నడిపారని మరియు ఆ వాహనము వారి భీమా రికార్డులలో పెర్కొన్నదే అని నిర్దారించుకుంటారు. చివరిగా, వారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు ప్రమాదము జరిగినప్పుడు నడిపిన డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ను తనికీ చేస్తారు.
 • పై తెలిపిన తతంగం పూర్తి చేసిన తర్వాత, మరమ్మత్తు చేసేందుకు అనుమతిస్తారు. భీమా సంస్థ గ్యారేజుకి నేరుగా రిపేరు బిల్లులను పరిష్కరించుకోవచ్చు లేదా భీమాదారునికి తిరిగి చెల్లించడం జరుగుతుంది.

ఒక సొంత నష్టం దావా విషయంలో ఏమి చేయాలి?

 • ఒక ప్రమాదం సంభవించినప్పుడు-ఎవరైనా గాయాలతో బాధపడుతుంటే వైద్య చికిత్స కోసం ఏర్పాట్లు చేయండి. వీలయితే, ఇందులో భాగస్వాములైన ఇతర వాహనాలు / వ్యక్తుల యొక్క వివరాలను తీసుకోండి. దయచేసి ప్రమాదంలో ఏ నిర్లక్ష్యానికి అంగీకరించకండి మరియు పరిహారం ఇవ్వడానికి ఎవరితో ఒప్పుకోవద్దు.
 • హానికర చట్టం, అల్లర్లు, సమ్మె మరియు ఉగ్రవాద కార్యకలాపాలు కారణంగా, గాయం, మరణం, మూడవ పక్షం ఆస్తి నష్టం, దోపిడీ, దొంగతనం, ఇంటికి నష్టం వంటివి జరిగితే తక్షణ పోలీసు స్టేషనుకి సమాచారం ఇవ్వడం అవసరం.
 • ప్రమాదం తీవ్రంగా ఉంటే, మరియు వాహనం తరలించడానికి వీలులేకపోతే, అక్కడ వాహనానికి సరైన రక్షణ ఉండేలా చూసుకోండి. దయచేసి ప్రమాదానికి తరువాత ఇంజనుని స్టార్టు చేయడానికి గానీ,మరియు అవసరమైన మరమ్మత్తులు చేసే ముందు వాహనాన్ని నడపడానికి గానీ ప్రయత్నించకండి.
 • మీకు నచ్చిన సమీప గ్యారేజీకి వాహనాన్ని తరలించి మరియు వివరణాత్మక అంచనాను ( కార్మిక ఛార్జీలతో పాటు భాగాలు జాబితా వాటి ధరలతో సహా) వారిని అడగండి.
 • వాహనాన్ని సర్వే చేయడము/సర్వేయరు ద్వారా అంచనా వేసేంత వరకు దయచేసి వాహనాన్ని ప్రమాదం పరిస్థితి నుండి తొలగించకండి లేదా మార్చకండి లేదా మరమత్తులు చేయించకండి. అదే విధంగా ఏ సమయంలోను భాగాలు లేదా ఉపకరణాలు పోకుండా చూసుకోండి.
 • ఏదైన ప్రమాదం లేదా నష్టం గురించి వెంటనే మాకు తెలియజేయండి.
 • దయచేసి సరిగా/ పూర్తిగా పూరించిన దావా ఫారమును మాకు సమర్పించండి.
 • దయచేసి నగదు రహిత సౌకర్యంపై మార్గదర్శకత్వం కోసం నేరుగా చెల్లింపు సదుపాయాన్ని అటువంటి రిపేరుకి పొందాలంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
 • పత్రాలు ధృవీకరణ మరియు నిర్ధారణ (వాటి కాపీలతో పాటు) కొరకు సమర్పించాల్సి ఉంటుంది.
 • అసలైన వాహన రిజిస్ట్రేషన్ పుస్తకం (ఫిట్నెస్ సర్టిఫికేషనుతో సహా, అది ఒక విడి డాక్యుమెంటు అయితే)
 • అసలు డ్రైవింగ్ లైసెన్స్.
 • సమర్పించవలసిన డాక్యుమెంట్లు
 • పోలీసు ఫిర్యాదు కాపీ (ఎఫ్ఐఆర్)
 • మరమ్మత్తుల అంచనా.
 • మేము మీ దావాను పరిష్కరించడానికి అదనపు డాక్యుమెంటు(లు)ను కోరవచ్చు లేదా స్పష్టీకరణ(లు) కోసం అడగవచ్చు మరియు అది దావాపై ఆధారపడి ఉంటుంది. దయచేసి వాటిని సమర్పించడానికి ఏర్పాటు చేయండి.
 • అన్ని నష్టాలు ఒక సర్వేయరుచే సర్వే చేయబడుతుంది మరియు అంచనా వేయబడుతుంది మరియు దావా యొక్క ఆమోదము మరియు చెల్లించే విధానము ఈ ప్రక్రియ తరువాత జరుగుతుంది.

దయచేసి గమనించండి:దావా ఫారములో మాకు సరైన & సంపూర్ణ సంప్రదింపు వివరాలను (చిరునామా / టెలిఫోన్ నెంబర్లు / మెయిల్ ఐడి లు) ఇచ్చేలా మీరు నిర్ధారించుకోండి. మీరు ప్రమాదానికి సంబంధించి రమ్మని ఆజ్ఞాపించేల ఏదైనా నోటీసు వస్తే (క్రిమినల్ ప్రొసీడింగ్ కాకుండా, ఏదైనా ఉంటే), మమ్మల్ని ఆ అభ్యర్దన కాపీతో మమ్మల్ని సంప్రదించండి.

దొంగతనానికి సంబంధించిన దావా విషయంలో ఏం చేయాలి?

 • మీ కారు దొంగిలించబడినట్లయితే, మొదటిగా మీరు పోలీసు ఫిర్యాధును దాఖలు చేయాలి.
 • మీరు పోలీసులకి ఫిర్యాదు చేసిన వెంటనే మీ భీమా సంస్థకు తెలియజేయండి, ఆ దొంగ మీ కారుతో ఇతరులకు నష్టం కలిగించిన సందర్భంలో ఇది సహాయపడుతుంది. అదేవిధంగా, మీరు పోలీసులకి ఫిర్యాదు చేయనట్లయితే మీ భీమా సంస్థ మీ దావాను పరిష్కరించదని గమనించండి.
 • మీరు మీ భీమా సంస్థకి తెలియజేసినప్పుడు, మీ కారు యొక్క రుణ / అద్దె వివరాలను ఎఫ్ఐఆర్ తో పాటుగా అందజేయండి.
 • మీ కారు గురించి వివరాలు, మైలేజ్, సర్వీసుల రికార్డు ఉంటే వాటిని అందజేయండి. అలాగే కారుతో పాటు దొంగిలించబడిన వ్యక్తిగత వస్తువుల జాబితాను సమర్పించండి.
 • ఈ దొంగతనం గురించి మీ యొక్క RTO కి తెలియజేయడం కూడా చాలా ముఖ్యం.
 • దొంగతనం గురించి వెంటనే మీ ఫైనాన్స్ ఇచ్చిన వారికి తెలియజేయండి మరియు మీరు భీమా చేసుకున్న సంస్థతో కేసును నేరుగా చర్చించమని వారిని అడగండి, ఇది దావా ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
 • పోలీసులు వాహనమును కనుక్కుని తిరిగి ఇస్తే, ఆ విషయాన్ని మీ భీమా సంస్థకి తెలియజేయండి.
 • వాహనం కనుక్కుని తిరిగి ఇస్తే, మీ పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులకు అనుగుణంగా వాహనానికి నష్టపరిహారం చెల్లించడానికి భీమా సంస్థ బాధ్యత వహిస్తుంది మరియు ఒకవేళ వస్తువులు దొంగిలించబడి ఉంటే అవి మీ పాలసీ కింద భర్తీ చేయబడతాయి.
 • వాహనము దొరకనట్లయితే, పోలీసులు నాన్-ట్రేసబుల్ సర్టిఫికేట్ (NTC) ను అందించాలి మరియు సెక్షన్ 173 Crpc క్రింద తుది నివేదికను ఇవ్వాలి.
 • మీరు మీ కారును కొనుగోలు చేయడానికి కారు రుణాన్ని తీసుకున్నట్లయితే, భీమా సంస్థ నగదును నేరుగా ఫైనాన్స్ ఇచ్చిన వారికి చెల్లిస్తుంది. ఈ చెల్లింపు మొత్తము భీమా చేయించిన విలువ(IDV)లో ఉంటుంది. అయినప్పటికీ, వాడకం మరియు విఫణి విలువ ఆధారంగా ఇది భిన్నంగా ఉండవచ్చు.

Download Motor Policy

Feedback