క్లెయిమ్స్

PrintPrintEmail this PageEmail this Page

మీరు ఆరోగ్య భీమా దావా కోసం 2 మార్గాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు నగదు రహిత దావా కోసం వెళ్ళవచ్చు లేదా మీ దావాకు తిరిగి చెల్లింపు పొందండి. అనుసరించాల్సిన విధానాలు క్రింద ఇవ్వబడ్డాయి:

నగదు రహిత దావాల సౌకర్యం TPA యొక్క నెట్వర్క్ ఆసుపత్రులలో మాత్రమే అందుబాటులో ఉంది. ఏ నెట్వర్కింగ్ ఆసుపత్రి యొక్క ప్రస్తుత స్థితి గురించి మీరు చేరకముందే మా TPA నుండి వివరాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

ఈ సదుపాయం ప్రకారం, నగదు రహిత లావాదేవీల అభ్యర్ధనకు సంబంధించిన ఫార్మాలిటిని పూర్తి చేయటానికి నెట్వర్క్ ఆసుపత్రి మీకు సహాయం చేస్తుంది. మీ ఆరోగ్య కార్డుపై ఇచ్చిన మీ సభ్యత్వ సంఖ్యను తెలపడం ద్వారా మీరు మా మూడవ పార్టీ అడ్మినిస్ట్రేటర్ను వారి హెల్పు లైను ద్వారా కూడా సంప్రదించవచ్చు.

నగదు రహిత దావాలు రెండు రకాలు:

 • అత్యవసరంగా చేరిన దానికి నగదు రహిత దావాలను పొందే విధానం
 • ప్రణాళికాబద్ధముగా చేరిన దానికి నగదు రహిత దావాలను పొందే విధానం

అత్యవసరంగా చేరిన దానికి నగదు రహిత దావాలను పొందే విధానం:

 • స్టెప్ 1: ఒకవేళ నెట్వర్క్ ఆసుపత్రిలో చేరాలనుకుంటే మూడవ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టిపిఎ)కి వారి టోల్ ఫ్రీ నెంబరు ద్వారా తెలియజేయాలి. దయచేసి మీ ఆరోగ్య కార్డు సభ్యత్వ నెంబరును తెలియజేయండి.
 • స్టెప్ 2: ఆసుపత్రి భీమా సహాయక డెస్కులో లభించే నగదు రహిత అభ్యర్ధన ఫారంను నింపాలి మరియు మీకు చికిత్స చేస్తున్న వైద్యుడిచే ధృవీకరణ పొందాలి.
 • స్టెప్ 3: TPA కు నగదు రహిత అభ్యర్థన ఫారంతో పాటు వైద్య చికిత్స రికార్డులను ఫాక్స్ చేయండి.
 • స్టెప్ 4: TPA డాక్యుమెంటుని పరిశీలిస్తారు మరియు ఆసుపత్రికి వారి నిర్ణయాన్ని తెలియజేస్తారు. TPA నగదు రహిత అభ్యర్థనను మంజూరు చేయవచ్చు లేదా అవసరమైతే అధనపు డాక్యుమెంట్ల కొరకు కాల్ చేయవచ్చు.
 • స్టెప్ 5: TPA చేత నగదు రహిత దావాను ఆమోదించినప్పుడు ఆసుపత్రి బిల్లులు నేరుగా (పాలసీ పరిమితులకి లోబడి) చెల్లించబడతాయి. అనుమతి లేని టెలిఫోన్ ఛార్జీలు, ఆహారం, సహాయకుని చార్జీలు వంటి మొదలగునవి మాత్రం మీరే చెల్లించుకోవాలి.
 • స్టెప్ 6: నగదు రహిత దావాను TPA ఆమోదించకపోతే, ఆసుపత్రిలో బిల్లును చెల్లించండి మరియు తిరిగి చెల్లింపు కోసం దరఖాస్తు చేసుకోండి. పాలసీ నిబంధనలు మరియు షరతుల ప్రకారం దావా ఆమోదించబడుతుంది.

అన్ని డాక్యుమెంట్లు అందిన తరువాత మా TPA కి నగదు రహిత అభ్యర్ధన నిర్ణయాన్ని తెలపడానికి 24 గంటలు సమయం పడుతుంది.

ప్రణాళికాబద్ధముగా చేరిన దానికి నగదు రహిత దావాలను పొందే విధానం

 • స్టెప్ 1:చికిత్స కోసం మా నెట్వర్క్ ఆసుపత్రుల జాబితా నుండి ఒక ఆసుపత్రిని ఎంచుకోండి;
 • స్టెప్ 2: ఆసుపత్రిలో చేరడానికి 3 రోజుల ముందు మూడవ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టిపిఎ)కి వారి టోల్ ఫ్రీ నెంబరు ద్వారా తెలియజేయాలి, మీ ఆరోగ్య కార్డు సభ్యత్వ నెంబరును తెలియజేయండి.
 • స్టెప్ 3: ఆసుపత్రి భీమా హెల్ప్ డెస్క్ లో లభించే నగదు రహిత అభ్యర్ధన ఫారంను నింపాలి మరియు మీకు చికిత్స చేస్తున్న వైద్యుడిచే ధృవీకరణ పొందాలి.
 • స్టెప్ 4: TPA కు నగదు రహిత అభ్యర్థన ఫారంతో పాటు వైద్య చికిత్స రికార్డులను ఫాక్స్ చేయండి.
 • స్టెప్ 5: TPA డాక్యుమెంటుని పరిశీలిస్తారు మరియు ఆసుపత్రికి వారి నిర్ణయాన్ని తెలియజేస్తారు. TPA నగదు రహిత అభ్యర్థనను మంజూరు చేయవచ్చు లేదా అవసరమైతే అధనపు డాక్యుమెంట్ల కొరకు కాల్ చేయవచ్చు.
 • స్టెప్ 6: TPA చేత నగదు రహిత దావాను ఆమోదించినప్పుడు ఆసుపత్రి బిల్లులు నేరుగా (పాలసీ పరిమితులకి లోబడి) చెల్లించబడతాయి. అనుమతి లేని టెలిఫోన్ ఛార్జీలు, ఆహారం, సహాయకుని చార్జీలు వంటి మొదలగునవి మాత్రం మీరే చెల్లించుకోవాలి.
 • స్టెప్ 7: నగదు రహిత దావాను TPA ఆమోదించకపోతే, ఆసుపత్రిలో బిల్లును చెల్లించండి మరియు తిరిగి చెల్లింపు కోసం దరఖాస్తు చేసుకోండి. పాలసీ నిబంధనలు మరియు షరతుల ప్రకారం దావా ఆమోదించబడుతుంది.

అన్ని డాక్యుమెంట్లు అందిన తరువాత మా TPA కి నగదు రహిత అభ్యర్ధన నిర్ణయాన్ని తెలపడానికి 24 గంటలు సమయం పడుతుంది.

ఖర్చులని తిరిగి పొందే విధానం

మీరు నెట్వర్క్ ఆసుపత్రిలో నగదు రహిత సౌకర్యం పొందకపోయినా లేదా మీరు మా నెట్వర్క్ ఆసుపత్రుల జాబితాలో లేని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లయితే ఖర్చుల తిరిగి చెల్లింపు కోసం మీ అసలు పత్రాలను సమర్పించండి.

 • స్టెప్ 1: ఆసుపత్రిలో చేరిన వెంటనే డిశ్చార్జి తీసుకున్న 7 రోజులు మించకుండా IFFCO-టోకియో టోల్ ఫ్రీ నెంబర్ - 1800 103 5499 కి కాల్ చేసి తెలియజేయాలి. దయచేసి మీ పాలసీ ధృవీకరణ నెంబరుని దావా అభ్యర్ధన సమయంలో తెలపండి.
 • స్టెప్ 2: చికిత్సను ఉపయోగించుకోని మరియు ఆసుపత్రిలో అన్ని బిల్లులను చెల్లించండి మరియు ఖర్చుల తిరిగి చెల్లింపు కోసం దావాను దాఖలు చేయండి.
 • స్టెప్ 3: సంబంధిత దావా ఫారంను మా వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా లేదా మా కాల్ సెంటరుకి అభ్యర్ధన పెట్టుకోవడం ద్వారా పొందవచ్చు.

మా టోల్ నంబరు 1800 543 5499కి కాల్ చేయడం చిరునామా తెలుసుకున్న మా స్థానిక కార్యాలయాలకు కూడా దావా పత్రాలను సమర్పించబడవచ్చు.

మీకు దావాల పరిష్కారం కొరకు సహాయం అవసరమైతే, మీరు మా టోల్ నంబర్లు - 1800 543 5499కి కాల్ చేయడం ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు.

తనికీ డాక్యుమెంట్ల జాబితా

దావాను రీయింబర్సుమెంట్ పద్దతిలో చెల్లించాల్సిన సందర్భంలో సమర్పించవలసిన పత్రాలు - డాక్టరు ధృవీకరణతో పాటు పూర్తిగా నింపిన దావా ఫారం;

 • డిశ్చార్జి సారాంశము
 • బిల్లులు
 • మందుల చీటీలు
 • అడ్వాన్స్ రశీదులు మరియు ఫైనల్ రశీదులు
 • రోగ నిర్ధారణ పరీక్ష నివేదికలు, X రే, స్కాన్ మరియు ECG మరియు ఇతర చిత్రాలు

అవసరమైతే, దావాను పరిష్కరించే బృందం పైన పేర్కొన్న వాటినే కాకుండా ఇంకొన్ని పత్రాలను అడగవచ్చు.

దయచేసి గమనించండి:

 • అవసరమైన అన్ని పత్రాలను అందుకున్నప్పుడు దావాలు పరిష్కరించబడతాయి మరియు దావా పరిశీలన తర్వాత అవసరమైతే అధనపు పత్రాలు / సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
 • దావా అనుమతించదగినది అయితే చెక్కు మీకు పంపబడుతుంది. లేకపోతే, ఒక నిరాకరణ లేఖ మీకు పంపబడుతుంది
 • అన్ని డాక్యుమెంట్లు అందిన తరువాత ఖర్చులను తిరిగి పొందడానికి పెట్టిన దావా పరిష్కారానికి 20 రోజుల సమయం పడుతుంది.

దావా చెల్లింపు

 • ఈ పాలసీ క్రింద ఉన్న అన్ని దావాలు భారత కరెన్సీలో చెల్లించబడతాయి. ఈ భీమా ప్రయోజనం కోసం అన్ని వైద్య చికిత్సలు భారతదేశంలో మాత్రమే తీసుకోవాలి.
 • IRDA నిబంధనల ద్వారా అందించిన దానికన్నా చెల్లించిన లేదా చెల్లించదగిన మొత్తం చెల్లింపులకు ఏ విధమైన వడ్డీ / పెనాల్టీ చెల్లించటానికి IFFCO టోకియో బాధ్యత వహించదు.
 • ప్రతిపాదితదారుడు దావా చెల్లింపు సమయంలో జీవించి లేనప్పుడు ప్రతిపాదకుడిని యొక్క చట్టబద్దమైన వారసుడికి చెల్లించబడుతుంది.

Download Motor Policy

Feedback