PrintPrintEmail this PageEmail this Page

ప్రవర్తనా నియమావళి:-

  • లైసెన్స్ ఉన్న ప్రతి ఏజెంట్ ఇక్కడ పేర్కొన్న ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలి:-

ప్రతి ఏజెంట్:

  •  సంబంధిత బీమా ప్రతినిధి మరియు పేర్కొన్న ప్రతి వ్యక్తి చర్య తీసుకోవడం విఫలమయ్యే సందర్భాలలో బాధ్యత వహించాలి;
  • బీమా ప్రతినిధి మరియు పేర్కొన్న వ్యక్తులందరికీ వారు విక్రయించే బీమా ఉత్పత్తుల విషయంలో సరైన శిక్షణ అందించేలా, తగిన నైపుణ్యాలను పొందేలా మరియు పూర్తి పరిజ్ఞానం ఉండేలా చూసుకోవాలి;
  • బీమా ప్రతినిధి మరియు పేర్కొన్న వ్యక్తి పాలసీ ప్రయోజనాలు మరియు పాలసీలో పొందే రాబడుల విషయంలో తప్పుడు హామీలు ఇవ్వకుండా చూసుకోవాలి;
  • బీమా ఉత్పత్తిని కోనుగోలు చేయమని ఏ విధంగానూ ఒత్తిడి చేయకూడదు;
  • బీమా ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి ముందు మరియు కొనుగోలు చేసిన తర్వాత బీమా చేసిన వ్యక్తికి ఆ ఉత్పత్తి విషయంలో తగిన సలహాలు ఇవ్వాలి;
  •   బీమా చేసిన వ్యక్తి క్లెయిమ్ చేస్తున్నప్పుడు పూర్తి చేయాల్సిన పనులు మరియు సమర్పించాల్సిన పత్రాల విషయంలో అన్ని విధాలుగా సహాయసహకారాలను అందించాలి;
  •  ఏజెంట్ ఏదైనా రిస్క్ విషయంలో పూచీకత్తు వహించరని లేదా బీమాదారుగా వ్యవహరించరని; ఇద్దరి విధులు మరియు బాధ్యతలు పేర్కొంటూ కుదుర్చుకున్న సేవా స్థాయి ఒప్పందాలలో భాగంగా ఉండరని స్పష్టంగా తెలియజేయాలి.
  • ప్రతి ఏజెంట్ లేదా బీమా ప్రతినిధి లేదా నిర్దిష్ట వ్యక్తి కూడా దిగువ పేర్కొన్న ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలి:
    •  ప్రతి ఏజెంట్/  బీమా ప్రతినిధి/ నిర్దిష్ట వ్యక్తి ---
      • §  వారు మరియు వారు ప్రాతినిథ్యం వహిస్తున్న బీమా సంస్థ గుర్తింపును కలిగి ఉండాలి;
      • §  అవసరమైనప్పుడు అడిగితే అతని లైసెన్స్/ ప్రమాణపత్రాన్ని చూపాలి;
      • §  వారి బీమాదారు విక్రయించే బీమా ఉత్పత్తులకు సంబంధించి ఆవశ్యక సమాచారాన్ని అందరికీ తెలియజేయాలి మరియు నిర్దిష్ట బీమా ప్లాన్‌ను సిఫార్సు చేస్తున్నప్పుడు ప్రాస్పెక్ట్ అవసరాలను పరిగణించాలి;
      • §  ప్రాస్పెక్ట్ అడిగినప్పుడు విక్రయానికి అందుబాటులో ఉన్న బీమా ఉత్పత్తికి సంబంధించి కమీషన్ స్థాయిని వెల్లడించాలి;
      • §  విక్రయానికి అందుబాటులో ఉన్న బీమా ఉత్పత్తి కోసం బీమాదారు ఛార్జీ చేసే ప్రీమియాన్ని తెలియజేయాలి;§  బీమాదారు ప్రపోజల్ ఫారమ్‌లో ఏ రకమైన సమాచారం అవసరం, అలాగే బీమా ఒప్పందాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన సమాచారాన్ని అందించడం ఎంత ముఖ్యం అనే విషయాలను ప్రాస్పెక్ట్‌కు వివరించాలి;
      • §  బీమాదారుకి సమర్పించే ప్రతి ప్రపోజల్‌తో పాటుగా నివేదిక (దీనిని “బీమా ఏజెంట్ గోప్య నివేదిక” అంటారు) రూపంలో ఏవైనా ప్రతికూల అలవాట్లు లేదా ఆదాయంలో అస్థిరత గురించి, అలాగే ప్రాస్పెక్ట్ గురించి అన్ని విధాలుగా విచారించడం ద్వారా బీమాదారు ప్రపోజల్‌ను ఆమోదించే విషయంలో పూచీకత్తు నిర్ణయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేలా ఏదైనా ముఖ్యమైన వాస్తవం ఉంటే దాన్ని బీమాదారు దృష్టికి తీసుకెళ్లాలి;
      • §  బీమాదారు ప్రపోజల్‌ను ఆమోదించారా లేదా తిరస్కరించారా అనే విషయాన్ని వెంటనే ప్రాస్పెక్ట్ కి తెలియజేయాలి;
      • §  బీమాదారు అందించే ప్రపోజల్ ఫారమ్‌ను పూరించే సమయంలో అవసరమయ్యే పత్రాలను; అలాగే ప్రపోజల్ ప్రక్రియను పూర్తి చేయడంలో భాగంగా బీమాదారు తదనంతరం అడిగే ఇతర పత్రాలను పొందాలి;
      • §  బీమాదారు క్లెయిమ్‌ల సెటిల్‌మెంటు ఆవశ్యకాలకు కట్టుబడి ఉండటంలో పాలసీదారులకు లేదా క్లెయిమెంట్‌లకు లేదా లబ్ధిదారులకు అవసరమైన సహాయాన్ని అందించాలి;
      • §  అవసరమైనప్పుడు నామినేషన్ లేదా హక్కుల నియోగింపు లేదా చిరునామాలో మార్పు లేదా ఎంపికల అమలు ఆచరణలో పెట్టమని సూచించాలి మరియు ఈ విషయాల్లో అవసరమైనప్పుడు సహాయాన్ని అందించాలి;
    • o    ఏజెంట్/  బీమా ప్రతినిధి/ నిర్దిష్ట వ్యక్తి ఎవరూ,----

      • §  చెల్లుబాటు అయ్యే లైసెన్స్/ ప్రమాణపత్రం లేకుండా బీమా వ్యాపారాన్ని అభ్యర్థించకూడదు లేదా పొందకూడదు;
      • §  ప్రపోజల్ ఫారమ్‌లో ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టేలా ప్రాస్పెక్ట్ ను ప్రేరేపించకూడదు;§  ప్రపోజల్ ఫారమ్‌లో లేదా ప్రపోజల్ ఆమోదం కోసం బీమాదారుకి సమర్పించే పత్రాలలో తప్పు సమాచారాన్ని అందించేలా ప్రాస్పెక్ట్ ను ప్రేరేపించకూడదు;
      • §  ప్రాస్పెక్ట్‌తో అమర్యాదగా ప్రవర్తించకూడదు;
      • §  వేరే ఇతర నిర్దిష్ట వ్యక్తి లేదా ఏదైనా బీమా మధ్యవర్తి ప్రారంభించిన ఏదైనా ప్రపోజల్‌లో జోక్యం చేసుకోకూడదు;
      • §  బీమాదారు అందించినవి కాకుండా వేర్వేరు ధరలు, ప్రయోజనాలు, నిబంధనలు మరియు షరతులను అందించకూడదు;
      • §  బీమా ఒప్పందం క్రింద లబ్దిదారు పొందే ఆదాయాల్లో వాటా అడగకూడదు లేదా స్వీకరించకూడదు;
      • §  ప్రస్తుత పాలసీని రద్దు చేయమని మరియు అలా రద్దు చేసిన నాటి నుండి మూడేళ్లలోపు కొత్త ప్రపోజల్‌ను సమర్పించమని పాలసీదారును బలవంతపెట్టకూడదు;§  ప్రీమియం ఏదైనా సంవత్సరంలో చెల్లించబడిన మొత్తం ప్రీమియంలో యాభై శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ లేదా ఒక సంస్థల సమూహం నుండి బీమా వ్యాపార పోర్ట్‌ఫోలియోను ఏజెంట్ కలిగి ఉండకూడదు; 
      • §  నిర్దేశిత అధికారి వారి లైసెన్స్‌ను రద్దు చేసినట్లయితే మరియు రద్దు చేసిన నాటి నుండి ఐదేళ్ల వ్యవధి పూర్తి కానట్లయితే బీమా ఏజెంట్‌గా ఉండటానికి కొత్త లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోలేరు;
      • §  ఏ బీమా సంస్థకు డైరెక్టర్ కాలేరు లేదా డైరెక్టర్‌గా కొనసాగలేరు;
    • o    ప్రతి ఏజెంట్ ఇప్పటికే సంపాదించి పెట్టిన బీమా వ్యాపారాన్ని జాగ్రత్తగా కాపాడే ఉద్దేశంతో పాలసీదారుకి నోటిమాటగా చెప్పడం మరియు వ్రాతపూర్వకంగా నోటీసు ఇవ్వడం ద్వారా నిర్ణీత సమయంలోపు పాలసీదారులు ప్రీమియాలను చెల్లించేలా అన్ని ప్రయత్నాలు చేయాలి.
    • o    సంస్థ డైరెక్టర్ లేదా సంస్థ భాగస్వామి లేదా ప్రధాన ప్రతినిధి లేదా బీమా ప్రతినిధి లేదా నిర్దిష్ట వ్యక్తి ఎవరూ వేరే బీమా సంస్థకు చెందిన మరొక ఏజెంట్‌తో అదే హోదాలో ఉండలేరు.

 


Download Motor Policy

Feedback