PrintPrintEmail this PageEmail this Page

బీమా ఏజెంట్ కావటం ఎలా:

అర్హత :

  • భారతదేశ పౌరసత్వం.
  • 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
  • కనీస అర్హతలు:
    • I గ్రామీణ: - 10 వ తరగతి పాస్ అయి ఉండాలి (గ్రామీణ రుజువు అవసరం. ఇది ఆ వ్యక్తి 5000 కంటే తక్కువ జనాభా ఉన్న ఒక గ్రామంలో నివసిస్తున్న వ్యక్తి అని పేర్కొనే BDO లేదా సర్పంచ్ జారీ చేసిన ప్రమాణ పత్రం)
    • II పట్టణ: - 12 వ తరగతి పాస్ అయి ఉండాలి
  • PAN నంబర్.
  • ఒప్పందంలోకి ప్రవేశించే సమయానికి అతని/ ఆమెకు సంబంధించిన వ్యక్తి ఎటువంటి సామర్ధ్యంలో కంపెనీతో పనిచేస్తూ ఉండకూడదు. ("బంధువు" భర్త లేదా భార్య, ఆధారపడిన పిల్లలు లేదా ఆధారపడిన సవతి పిల్లలు ఉద్యోగితో కలిసి నివసిస్తున్నా లేకపోయినా చేర్చాలి)
  • ఆ వ్యక్తి ఏదైనా సాధారణ బీమా కంపెనీ నుండి ఏజెన్సీ లైసెన్స్ కలిగి ఉండ కూడదు (లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు కంపోజిట్ ప్రక్రియను అనుసరించ వలసి ఉంటుంది)

అవసరమైన పత్రాలు:

  • ఏజెంట్ అప్లికేషన్ ఫారం.
  • స్పాన్సర్ షిప్ ఫారం.
  • పుట్టిన తేదీ యొక్క రుజువు.
  • అర్హత యొక్క రుజువు.
  • PAN కార్డు.
  • మూడు స్టాంపు సైజు ఫోటోలు .
  • చిరునామా రుజువు.
  • మొబైల్ నెంబర్.
  • ఇమెయిల్ అడ్రస్.
  • Jpg ఫార్మాట్లో ఫోటో మరియు సంతకం. (ఫైలు పరిమాణం ఫోటోకి 50Kb కంటే తక్కువగా మరియు సంతకం కోసం 10KB ఉండాలి).

IRDA శిక్షణ:

బీమా ఏజెంట్ గా వ్యవహరించడానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసే ఒక దరఖాస్తుదారు ఒక IRDA- ఆమోదిత సంస్థ నుండి సాధారణ శిక్షణలో కనీసం 50 గంటల ప్రాక్టీస్ శిక్షణతో పూర్తి చేయవలసి ఉంటుంది, ఇది ఒక వారం వ్యవధి ఉంటుంది. తన లైసెన్సు రెన్యువల్ కోసం, ఏజెంట్ కేవలం 25 గంటలు శిక్షణ పొందుతారు. శిక్షణ ఖర్చు ఇఫ్కో టోకియో ద్వారా చేయబడుతుంది.

IRDA పరీక్ష:

IRDA శిక్షణ విజయవంతంగా పూర్తి అయిన తరువాత, అభ్యర్థి ఏజెన్సీ పరీక్ష పాస్ అవ్వాలి. పరీక్ష కోసం ఫీజు రూ.350.00 లు ఏజెంట్ చెల్లించాలి. పరిశీలక అథారిటీ అయిన NSE.IT పేరున DD ఉండాలి. పరీక్షా కేంద్రం పరీక్ష అయిన తర్వాత అభ్యర్థికి మార్క్ షీట్ను అప్పగించును.

లైసెన్సింగ్ కోసం ఉత్తీర్ణత పొందిన అభ్యర్ధి యొక్క కింది పత్రాలు అవసరం ఉంటుంది

  • ఫారం VA
  • "ఏజెన్సీ ఒప్పందం"
  • మార్క్ షీట్ కాపీ (పరీక్ష కేంద్రంలో ఇవ్వబడుతుంది)
  • లైసెన్స్ ఫీజు (ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపనీ లిమిటెడ్ పేరుతో అభ్యర్థి నుండి రూ.250.00కు బ్యాంక్ చెక్ ఇవ్వవలెను)

Download Motor Policy

Feedback